తెలంగాణ, ఖమ్మం. 2 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురం స్వగ్రామంలో దసరా వేడుక సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజల ఆప్యాయతను స్ఫూర్తిగా తీసుకుని... గ్రామస్థులతో కలిసి దసరా ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. “నవరాత్రులు నిష్ఠతో, నియమాలతో ఆచరించిన భక్తుల కోరికలను అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అప్లైశ్వర్యాలు, ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రతి తెలుగు ఇంట్లో వర్ధిల్లాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున అందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అదే విధంగా సత్తుపల్లి మండలం రేచర్ల గ్రామంలో జరిగిన శివాలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు