విజయదశమి వేడుకల్లో శమీ పూజలు చేసిన మంత్రి పొన్నం
తెలంగాణ, హనుమకొండ.2 అక్టోబర్ (హి.స.) హన్మకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య న
మంత్రి పొన్నం


తెలంగాణ, హనుమకొండ.2 అక్టోబర్ (హి.స.)

హన్మకొండ జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శమీ పూజ చేసి ఆయుధాలను పూజించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రసంగించారు. ముందుగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఈ పండుగ రోజున అందరికీ మంచి విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాలకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. ఈ మేరకు చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిశీలించి జీవో జారీ చేసిందని, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిందని తెలిపారు. కొంతమంది మేధావులు, బీసీ నాయకులమని చెప్పుకునేవారు ఈ నిర్ణయానికి సహకరించకపోతే మౌనంగా ఉండాలని సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande