తెలంగాణ, నారాయణపేట. 2 అక్టోబర్ (హి.స.)
మక్తల్ లోని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా గురువారం మంత్రి వాకిటి శ్రీహరి- లలితమ్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్న స్వామికి మహా మంగళహారతి ఇచ్చారు. మక్తల్ పట్టణంలో బ్రాహ్మణవాడలో కొలువై ఉన్న అతి పురాతన వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం దశమి రోజు కళ్యాణోత్సవం నిర్వహించడం ఆచారం. అయితే ఈ సంవత్సరం నుండి స్వామికి కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు ఇచ్చే ఆచారాన్ని మంత్రి వాకిటి శ్రీహరి నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ మాడ వీధుల్లో రథోత్సవం నిర్వహించగా రథాన్ని మంత్రి దంపతులు లాగడం స్వామికి మహా మంగళ హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం ఆలయ గర్భగుడి జీర్ణావస్థలో ఉన్న విషయాన్ని వంశపారంపర్య పూజారి శామాచారి మంత్రి దృష్టికి తీసుకుపోగా స్పందించి ఆలయ నిర్మాణానికి గాను రూ.40 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు