నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వినీత్ కుమార్
తెలంగాణ, నారాయణపేట. 2 అక్టోబర్ (హి.స.) నారాయణపేట జిల్లా ఎస్పీగా గురువారం డాక్టర్ జి వినీత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన యోగేష్ గౌతమ్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈయన సుమారు రెండు సంవత్సరాలపాటు ఇక్కడ పనిచేశ
నారాయణపేట ఎస్పి


తెలంగాణ, నారాయణపేట. 2 అక్టోబర్ (హి.స.)

నారాయణపేట జిల్లా ఎస్పీగా గురువారం డాక్టర్ జి వినీత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన యోగేష్ గౌతమ్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈయన సుమారు రెండు సంవత్సరాలపాటు ఇక్కడ పనిచేశారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ బదిలీ స్థానంలో (2017 ఐపీఎస్) మాదాపూర్ డిసిపి గా పని చేసిన వినీత్ నారాయణపేట జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. కాగా గురువారం ఉదయం 11 గంటలకు నూతన ఎస్పీ బాధ్యతలు తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande