తెలంగాణ, నిజామాబాద్. 2 అక్టోబర్ (హి.స.)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 2,60,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఔట్ ఫ్లో 2,59,397 క్యూసెక్కులుగా ఉంది. 39 ప్రధాన గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1086.30 అడుగులుగా ఉంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 64.036 టీఎంసీలుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు