నల్గొండలో తీవ్ర విషాదం.. డిండి వాగులో దిగి ముగ్గురు మృతి
తెలంగాణ, నల్గొండ. 2 అక్టోబర్ (హి.స.) దసరా పండగ పూట నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వాగులోకి దిగి ముగ్గురు మృతి చెందారు. తొలుతో వాగులోకి దిగిన సాయి ఉమాకాంత్ (10) అనే బాలుడు గల్లంతయ్యాడు. వాగులో పడిన బాలుడిని కాప
నల్గొండలో విషాదం


తెలంగాణ, నల్గొండ. 2 అక్టోబర్ (హి.స.)

దసరా పండగ పూట నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వాగులోకి దిగి ముగ్గురు మృతి చెందారు. తొలుతో వాగులోకి దిగిన సాయి ఉమాకాంత్ (10) అనే బాలుడు గల్లంతయ్యాడు. వాగులో పడిన బాలుడిని కాపాడేందుకు రాము(30), గోపి(21) సైతం వాగులోకి దిగి గల్లంతయ్యారు. ముగ్గురు గల్లంతు కావడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ముగ్గురు మృతులు పండగ కోసం తెనాలి నుంచి బంధువుల ఇంటికి వచ్చారు. పండగపూట తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande