అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)పరమ శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ నెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చాలా మంది పంచారామాలతోపాటు శైవ క్షేత్రాలను సందర్శిస్తారు. ఇక అయ్యప్ప మాలధారులు సైతం శబరిమలకు వెళ్తుంటారు. ఆ భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ బస్టాండ్ల నుంచి మొత్తం 157 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ