భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)దీపావళి సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తుల రాకతో నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని భాజపా ఎంపీ లక్ష్మణ్‌, ఆ పార్టీ నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande