బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్‌
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ‍ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్‌


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ‍ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.

ఇక, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్‌ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్‌గూడ హైలం కాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande