సిటీలో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న మొజంజాహి మార
సిటీలో స్పెషల్ డ్రైవ్


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న మొజంజాహి మార్కెట్‌ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించి కేవలం 3 గంటల్లోనే 6 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. పట్టుబడుతున్న వాహనదారుల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande