మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్‌
ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు
మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్‌


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)పండుగకు మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్‌.. ఇవిగో డీటేల్స్..!

దీపావళి పండుగకు స్వీట్లు కొంటున్నారా..? బీ కేర్‌ ఫుల్‌..! మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్‌ అని తేల్చారు అధికారులు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ నెయ్యి, నాన్-ఫుడ్ గ్రేడ్ ఫాయిల్, ప్రమాదకర సింథటిక్ రంగులతో స్వీట్లు తయారు చేస్తున్న షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పండుగ పేరుతో నాసిరకమైన పదార్థాలతో తయారైన స్వీట్లు మార్కెట్‌లోకి రావడంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande