హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)
దీపావళి సందర్భగా భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ రాంచందర్ రావు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గించి ప్రజలకు మోడీ బహుమతిగా ఇచ్చారని అన్నారు. బట్టలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గాయని చెప్పారు. ధరలు తగ్గినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని, సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి జరుపుకుంటున్నారని చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ..... కుల మతాలకు అతీతంగా భారత్ను ప్రపంచంలోనే అన్ని దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ ఏకం అవ్వాలని చెప్పారు. భారీతీయులంతా స్వదేశీ వస్తువులనే వాడాలని ఆత్మనిర్భర్ భారత్ కు తోడ్పడాలని చెప్పారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు