కరోనా పాజిటివ్ అని చెప్పి.. రోగి అవయవాలు కాజేసిన డాక్టర్స్..
ముంబై, 20 అక్టోబర్ (హి.స.) కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ (Corona Positive) అని రిపోర్టు ఇచ్చి, రోగి అవయవాలను అపహరించడమే కాక, ఏకంగా శవాన్నే మాయం చేసిన అహల్యానగర్ నగరానికి చెందిన ఐదుగురు ప్రముఖ వైద్యులు, ఒక గుర్తు తెలియని ఉద్యోగిపై కేసు నమోదు చేయా
డాక్టర్లపై కేసు


ముంబై, 20 అక్టోబర్ (హి.స.)

కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ (Corona Positive) అని రిపోర్టు ఇచ్చి, రోగి అవయవాలను అపహరించడమే కాక, ఏకంగా శవాన్నే మాయం చేసిన అహల్యానగర్ నగరానికి చెందిన ఐదుగురు ప్రముఖ వైద్యులు, ఒక గుర్తు తెలియని ఉద్యోగిపై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మృతుడి కుమారుడు అశోక్ బాబన్ రావ్ ఖోక్రలే ఫిర్యాదు మేరకు అహిల్యా నగర్లోని న్యూక్లియస్ హాస్పిటల్కు చెందిన వైద్యులు గోపాల్ బహురూపి, సుధీర్ బోరర్, సచిన్ పండులే, అక్షయ్ దీప్ జవారే, ముకుంద్ తాండలే, విఖే పాటిల్ మెమోరియల్ హాస్పిటల్ ల్యాబ్తో పాటు ఇతర ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశోక్ ఖోక్రాలే తండ్రి బాబన్ రావు (79)కు అనారోగ్యంగా ఉండటంతో 2020 ఆగస్టు 13న పాటియాలా హౌస్లోని డాక్టర్ పండులే కొవిడ్ 19 కేంద్రంలో చేర్చారు. మరుసటి రోజు అశోక్కు చెప్పకుండానే బాబన్ రావును డాక్టర్ బహురూపి, డాక్టర్ బోరర్లు న్యూక్లియస్ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తండ్రిని చూడటానికి కుమారులను కూడా అనుమతించ లేదు. పైగా అతనికి కరోనా పాజిటివ్ అని చెప్పి డిశ్చార్జ్ చేయడానికి నిరాకరించారు.

మృతదేహం ఎక్కడ?

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande