ఢిల్లీ,20, అక్టోబర్ (హి.స.) చైనాపై టారిఫ్‌ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌పై సుంకాల గురించి ట్రంప్‌ను జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు (Russian oil imports).
భారత్ త్వరలోనే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించడంపై ట్రంప్‌ను జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. 'ఒకవేళ వారు అలాగే చెప్పాలనుకుంటే (మోదీ-ట్రంప్ ఫోన్‌కాల్ గురించి).. వారు భారీ స్థాయిలో సుంకాలు చెల్లిస్తూనే ఉండాలి. కానీ, భారత్ అలా చేయబోదని అనుకుంటున్నా' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు