వారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు.. దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
చెన్నై, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ
ఉదయనిధి స్టాలిన్


చెన్నై, 20 అక్టోబర్ (హి.స.)

దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. “నేను వేదికపైకి వస్తున్నప్పుడు చాలామంది నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. మరి కొందరు నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. కొందరు దీపావళికి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అని సంకోచించారు. నేను ఏమనుకుంటానో అని వెనక్కి తగ్గారు. అయితే ఆ విశ్వాసం ఉన్నవారికి నేను దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాను.” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి. డీఎంకే హిందువులపై వివక్ష చూపుతోందని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై మండిపడ్డారు. వారు అంగీకరించినా.. అంగీకరించకపోయినా వారు ప్రాథమికంగా హిందువులు. నమ్మేవారిని మాత్రమే మేము కోరుకోము. ఉదయనిధి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.” అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్లకు తమిళిసై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande