మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి.. వివాదం రేపుతున్న బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్, 20 అక్టోబర్ (హి.స.) బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరిక
ప్రజ్ఞ సింగ్


మధ్యప్రదేశ్, 20 అక్టోబర్ (హి.స.)

బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, ఈ నెల ప్రారంభంలో భోపాల్లో జరిగిన ఒక ధార్మిక కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా తమ కుమార్తెలు ప్రవర్తిస్తే వారిని శారీరకంగా శిక్షించాలని సూచించారు. అలాగే, మీ కుమార్తె మాట వినకుండా హిందూయేతరుల ఇంటికి వెళితే, ఆమె కాళ్లు విరగ్గొట్టడానికి ఏ మాత్రం వెనుకాడకండి అని పేర్కొనింది. విలువలను పాటించనివారు, తల్లిదండ్రుల మాట విననివారు శిక్షార్హులు అని చెప్పుకొచ్చింది. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారిని కొట్టాల్సి వస్తే వెనకడుగు వేయకండి అని తెలిపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా తీవ్రంగా ఖండించారు. మత మార్పిడి ఆరోపణలతో మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయయని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రజల్లో ఇంత విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande