స్క్రీన్ మిర్రరింగ్తో ఖాతా ఖాళీ.. ఆ వాట్సాప్ మేసేజ్ లు ఓపెన్ చేస్తే ఇక అంతే!
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ లేదా బ్యాంక్ అధికారులమంటూ వాట్సాప్పై మేసేజ్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ఫోన్ స్క్రీన్స్ షేరింగ్లోకి (Screen Mirroring) మిమ్మల్ని లాగడమే సదరు స్కామర్ల పని. నమ్మారో.. రియల్ టైంలో మీ
సైబర్ క్రైమ్


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ లేదా బ్యాంక్ అధికారులమంటూ వాట్సాప్పై మేసేజ్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ఫోన్ స్క్రీన్స్ షేరింగ్లోకి (Screen Mirroring) మిమ్మల్ని లాగడమే సదరు స్కామర్ల పని. నమ్మారో.. రియల్ టైంలో మీ ప్రతీ చర్యను మోసగాళ్లు పసిగట్టేస్తారు. మీ బ్యాంకింగ్ యాప్లను స్వాధీనం చేసుకొని, పాస్వర్డ్లను, ఓటీపీలను కనిపెట్టి ఖాతాల్లోని సొమ్మును కాజేస్తారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకే తెలియకుండా మీ ఫోన్లో కొన్ని రహస్య యాప్లను ఇన్స్టాల్ చేసి వాటిద్వారా మీ ఫోన్ను హ్యాక్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి స్క్రీన్ షేరింగ్ లేదా అనవసరపు/గుర్తు తెలియని యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఎలాంటి లింక్లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అనుమానిత కాల్స్, సందేశాలు.. మోసాలకు దారితీసే వీలుండటంతో వాటిపట్ల అప్రమత్తంగా ఉండి సంబంధిత బ్యాంకులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande