హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్దాన్ని సాగిస్తూ, మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ నెల 23 వరకు నిరసన వ్యక్తం చేయాలని, 24 న దేశావ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. కగార్ ఆపరేషన్ నిలిపివేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు