రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ, 20 అక్టోబర్ (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జి జి హెచ్ ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ చేశారు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మా
డిజిపి


తెలంగాణ, 20 అక్టోబర్ (హి.స.)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా

మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జి జి హెచ్ ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ చేశారు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అనంతరం పోలీసులపై కాల్పులు (firing) జరిపేందుకు రియాజ్ ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రౌడీ షీటర్ రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆస్పత్రిలో ఉన్న చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకే పోలీసులు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారని డీజీపీ తెలిపారు. అయితే మొదట రియాజ్ కాల్పులు జరపగా ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా పోలీసులు నింధితునిపై కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande