న్యూఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది. 'వెరీ పూర్' కేటగిరీలోకి చేరడంతో ఢిల్లీ నగరంతోపాటు రాజధాని ప్రాంత పరిధిలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 (GRAP-2) నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో 414, వాజీపూర్ ప్రాంతంలో వాయు నాణ్యత 407గా నమోదవడంతో సెవర్ కేటగిరీలో చేరాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..