తిరుమల.శ్రీవారి ఆలయంలో.వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల, 20 అక్టోబర్ (హి.స.) : తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ఘంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిలో
తిరుమల.శ్రీవారి ఆలయంలో.వైభవంగా దీపావళి ఆస్థానం


తిరుమల, 20 అక్టోబర్ (హి.స.)

: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ఘంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిలో స్వామివారి సేనాధిపతి విష్వక్సేనులు దక్షిణ అభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం అక్కడ ఉత్సవ మూర్తులు, మూల విరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు, నివేదనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయగా.. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande