మాది అగ్రికల్చర్ మీది గన్ కల్చర్.. హరీష్ రావు
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నేతలు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంల
హరీష్ రావు


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్

సిటీ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నేతలు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao).. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో గన్ కల్చర్ (Gun culture) పెరిగిపోయిందని, బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ప్రోత్సహిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) గన్ కల్చర్ తీసుకొచ్చిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అలాగే ఈ ప్రభుత్వంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ హోంమంత్రిగా ఉన్నప్పటికి హోంశాఖపై కనీసం సమీక్ష జరపడం లేదని, కాంగ్రెస్ నేతలు, మంత్రులు వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande