10,650 ఎంబీబీఎస్‌ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ ఆమోదం
దిల్లీ: 20అక్టోబర్ (హి.స.) దేశంలో 2024-25 విద్యాసంవత్సరానికి 10,650 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచడానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్ల పెంపుదలకు 41 ప్రభుత్వ కళాశాలలు, 129 ప్రైవేటు కళాశాలలు చేసిన ప్రతిపాదనలకు స
10,650 ఎంబీబీఎస్‌ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ ఆమోదం


దిల్లీ: 20అక్టోబర్ (హి.స.)

దేశంలో 2024-25 విద్యాసంవత్సరానికి 10,650 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచడానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్ల పెంపుదలకు 41 ప్రభుత్వ కళాశాలలు, 129 ప్రైవేటు కళాశాలలు చేసిన ప్రతిపాదనలకు సమ్మతి తెలిపామని కమిషన్‌ అధిపతి డాక్టర్‌ అభిజాత్‌ శేథ్‌ చెప్పారు. వీటితో కలిపి దేశంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 1,37,600కి పెరిగిందని తెలిపారు. పీజీ కోర్సుల్లో 3,500 సీట్ల పునరుద్ధరణ, కొత్తవాటి మంజూరుకు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రాబోయే విద్యాసంవత్సరానికి సంస్థలకు ఇచ్చిన గుర్తింపు, పరీక్షలు, సీట్ల ఆమోదం వంటి వివరాలు త్వరలోనే ప్రచురిస్తామని, 2025-26 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల నిమిత్తం పోర్టల్‌ను నవంబరు తొలినాళ్లలో ప్రారంభిస్తామని వివరించారు. క్లినికల్‌ పరిశోధనల్ని వైద్యవిద్యతో సమీకృతం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

3

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande