మంచిర్యాల జిల్లాలో దారుణం.. భర్త చేతిలో భార్య హతం..
మంచిర్యాల, 20 అక్టోబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద మందమర్రికి చెందిన జగన్నాధం రజిత(26)ను భర్త కుమార్ గొంతు నులిమి చంపాడు. బ్రిడ్జిపై నుండి పడేసినట్లు పోలీసుల సమాచారం. ఆదివారం
భార్య హత్య


మంచిర్యాల, 20 అక్టోబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద మందమర్రికి చెందిన జగన్నాధం రజిత(26)ను భర్త కుమార్ గొంతు నులిమి చంపాడు. బ్రిడ్జిపై నుండి పడేసినట్లు పోలీసుల సమాచారం. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్ కోసం నస్పూర్ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande