దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.) దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ వెలుగుల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం మరియు శ్రేయస్సును ప్రకాశింపజేయు గాక. మన చుట్టూ సాన
Pm Modi


ఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.)

దీపావళి పండుగ సందర్భంగా దేశ

ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ వెలుగుల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం మరియు శ్రేయస్సును ప్రకాశింపజేయు గాక. మన చుట్టూ సానుకూల స్ఫూర్తి ప్రసాదించుగాక,” వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. చెడుపై మేలుకి సంకేతంగా, చీకటిపై వెలుగుకి ప్రతీకగా దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా ప్రేమ, ఐక్యత, సంతోషం పరిపూర్ణంగా నిండిపోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు నిండిన దీపావళి కావాలని ఆమె ఆకాంక్షించారు. దీపావళి పండుగ భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా, విశేషంగా జరుపుకునే పర్వదినమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పండుగ చీకటిపై వెలుగుకు, అజ్ఞానంపై జ్ఞానానికి, చెడుపై మేలుకి సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకునే ఈ పర్వదినం ప్రేమ, సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande