పట్నా: ,20, అక్టోబర్ (హి.స.)
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్’లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆర్జేడీ (RJD) అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వైశాలి జిల్లాలోని రాఘోపుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. (Bihar Assembly Elections)
బిహార్ ఎన్నికల (Bihar Elections) రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగియనున్న వేళ ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేయడం గమనార్హం. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు అక్టోబరు 17నే ముగిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు