హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)
తెలంగాణలో ఇటీవల కొన్ని దారుణ
సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్ బలానగర్ లో 27 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే కృష్ణా జిల్లా చిలకలపాడు గ్రామంలో ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను విషం తాగించి హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
కొండమల్లేపల్లి (Kondamallepalli)కి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కొండమల్లేపల్లి లో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాగలక్ష్మి(27) అవంతిక(9) నాగసాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బంధువులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..