హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) భారత దేశంలో 85 శాతానికి పైగా
డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో పెను విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో ఆయన తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..