రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు..
వేములవాడ, 20 అక్టోబర్ (హి.స.) దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూ
రాజన్న ఆలయం


వేములవాడ, 20 అక్టోబర్ (హి.స.) దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి రాజ రాజేశ్వరీదేవితో పాటు ఆలయ ఆవరణలోని శ్రీ వీరభద్రేశ్వర, శ్రీ విఠలేశ్వర, శ్రీ నరసింహస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. వారి వెంట రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande