కావలి, 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబ్బానాయుడు అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో తీవ్ర విషాదం.. పార్టీ సీనియర్ నేతు, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో గత 10 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV