అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)నైరుతి రుతుపవనాలు భారత దేశాన్ని పూర్తిగా వదిలి పోయినప్పటికి.. పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తనం 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉంటే ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనం బలపడుతుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV