ఎన్నికల వేళ.. డ్రై స్టేట్‌ బిహార్‌లో రూ.23 కోట్ల మద్యం సీజ్‌
పట్నా: 20అక్టోబర్ (హి.స.) బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల
ఎన్నికల వేళ.. డ్రై స్టేట్‌ బిహార్‌లో రూ.23 కోట్ల మద్యం సీజ్‌


పట్నా: 20అక్టోబర్ (హి.స.)

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనల కింద స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.23.41కోట్ల విలువైన మద్యం (Liquor) కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే బిహార్‌లో ఏప్రిల్‌ 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతుండడం గమనార్హం.

ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అక్టోబర్ 6 నుంచి బిహార్‌ పోలీసులు, సంబంధిత భద్రతా సంస్థలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 753 మందిని అరెస్టు చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande