ఏపీకి ఆస్ట్రేలియా టాప్ వర్సిటీ చేయూత.. విద్య, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యానికి మంత్రి లోకేశ్ ప్రతిపాదన
సిడ్నీ, 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో విద్య, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక అడుగు వేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్
లోకేశ్


సిడ్నీ, 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో విద్య, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక అడుగు వేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (యూఎన్ఎస్‌డబ్ల్యూ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థులు, యువత, పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక రంగాల్లో కలిసి పనిచేయాలని యూనివర్సిటీ ప్రతినిధులను కోరారు.

మంత్రి లోకేశ్‌కు ఘనస్వాగతం పలికిన యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశోధకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్టెమ్ (ఎస్‌టీఈఎం) పునరుత్పాదక ఇంధన వనరుల వంటి అధునాతన టెక్నాలజీలలో ఏపీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్థానిక స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతుతో ఏపీలో ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

అంతేకాకుండా, సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిశోధనల్లో ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. టెలీ మెడిసిన్, ప్రజారోగ్యం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, సుపరిపాలన వంటి అంశాల్లోనూ యూఎన్ఎస్‌డబ్ల్యూ తమ నైపుణ్యాన్ని ఏపీ ప్రభుత్వంతో పంచుకోవాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande