ఢిల్లీ, 20 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలు తన దీపావళి వేడుకలను భారత సైన్యంతో జరుపుకుంటు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు దీపావళి పండుగను ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఐఎన్‌ఎస్ విక్రాంత్ గోవా, కర్ణవార్ తీరానికి సమీపంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో సైనికుల వేడుకులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇవాళ, ఒక వైపున నాకు సరిహద్దులు లేని ఆకాశం, అబ్బరాల హరిజన సౌందర్యం కనిపిస్తుంది. మరో వైపున, ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉంది. ఇది అపార శక్తులను ప్రతిబింబిస్తోంది. సముద్రంపై సూర్య కిరణాల ప్రకాశం సైనికులు వెలిగించిన దీపాలాగే ఉంటుందని అన్నారు.
అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్‌లో రాత్రంతా గడపడం మాటల్లో వ్యక్తపరచడం కష్టమని. నిన్న సైనికులు పాడిన పాటలు, వాటిలో ఆపరేషన్ సిందూర్‌ను వారు వర్ణించిన విధానం - యుద్ధభూమిలో ఉన్న సైనికుడి కంటే ఏ కవి కూడా బాగా వర్ణించలేడని తాను అనుకుంటున్నాను అని ప్రధాని అన్నారు. ఈ భారీ ఓడలు, వేగవంతమైన విమానాలు, జలాంతర్గాములు సిద్ధంగా ఉన్నాయి, కానీ సైనికులు మోస్తున్న శౌర్యం వాటిని నిజంగా గొప్పగా చేస్తుంది. ఈ ఓడలు ఇనుముతో తయారు చేయబడి ఉండవచ్చు, కానీ సైనికులు వాటిపైకి వచ్చినప్పుడు, అవి సజీవ ఆయుధాలుగా మారతాయని కొనియాడారు. ప్రధాని మోడీ సైనికులు ధైర్యం, సమర్పణను స్మరించిన ఈ సందర్భం, దేశ రక్షకులతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రతిష్టాత్మకంగా నిలిచింది.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV