200 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటున్న ఏపీలోని గ్రామం.. కారణం ఇదే!
శ్రీకాకుళం, 20 అక్టోబర్ (హి.స.)దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా ఈ పండుగకు దూరంగా ఉంటోంది. దీపావళి రోజున ఆ ఊరంతా చీకట్లోనే మగ్గిపోతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పున్నానపాలెం గ్ర
200 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటున్న ఏపీలోని గ్రామం.. కారణం ఇదే!


శ్రీకాకుళం, 20 అక్టోబర్ (హి.స.)దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా ఈ పండుగకు దూరంగా ఉంటోంది. దీపావళి రోజున ఆ ఊరంతా చీకట్లోనే మగ్గిపోతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పున్నానపాలెం గ్రామస్థులు గత 200 ఏళ్లుగా దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. దీని వెనుక ఓ తీవ్రమైన విషాద గాథ ఉంది.

వివరాల్లోకి వెళితే, సుమారు 200 ఏళ్ల క్రితం దీపావళి పండుగ రోజున పున్నానపాలెం గ్రామంలో ఊహించని దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అదే రోజున గ్రామానికి చెందిన మరో రైతు ఇంట్లో రెండు ఎద్దులు కూడా అకస్మాత్తుగా మరణించాయి. ఒకే రోజు జరిగిన ఈ వరుస విషాదాలతో గ్రామస్థులు తీవ్రంగా కలత చెందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande