తీవ్ర వాయుగుండ ప్రభావం తో ఉత్తరాంధ్ర లో.పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి
శ్రీకాకుళం, 3 అక్టోబర్ (హి.స.) : తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తు్న్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చే
తీవ్ర వాయుగుండ ప్రభావం తో ఉత్తరాంధ్ర లో.పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి


శ్రీకాకుళం, 3 అక్టోబర్ (హి.స.)

: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తు్న్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటం.. ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు ఉన్నందున 10 మండలాల్లోని విద్యాసంస్థలకు నేడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande