కర్నూలు జిల్లా దేవరగట్టు. బన్నీ ఉత్సవాల్లో ఇద్దరు భక్తుల మృతి
కర్నూలు, 3 అక్టోబర్ (హి.స.) : జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరి
కర్నూలు జిల్లా దేవరగట్టు. బన్నీ ఉత్సవాల్లో ఇద్దరు భక్తుల మృతి


కర్నూలు, 3 అక్టోబర్ (హి.స.)

: జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande