
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) ఆస్ట్రేలియా క్రికెట్ లో(Australia) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెల్బోర్న్ (Melbourne)కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ఇవాళ కన్నుమూశాడు. ఫెర్న్ ట్రీ గల్లీలోని వాలీ ట్యూ రిజర్వ్ ట్వంటీ-20 మ్యాచ్కు ముందు ఆటోమేటిక్ బౌలింగ్ మెషిన్తో మంగళవారం రాత్రి ప్రాక్టీస్ చేస్తుండగా బంతి నేరుగా వచ్చి మెడ భాగంలో వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో బెన్ ఆస్టిన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
దీంతో సహచర ఆటగాళ్లు అతడిని చికిత్స నిమిత్తం మొబైల్ ఇంటెన్సివ్ కేర్ వాహనంలో క్లేటన్లోని మోనాష్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు తరలించగా.. చిన్న మెదడకు గాయమైనట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందజేస్తుండగా పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం బెన్ ఆస్టిన్ కన్నుమూశాడు. ఈ మేరకు అతడి మరణాన్ని ఫెర్న్ క్రికెట్ క్లబ్ (Ferntree Cricket Club) ధృవీకరించింది. బెన్ ఆస్టిన్ క్రికెటర్, గొప్ప నాయకుడని క్లబ్ సభ్యులు అభివర్ణించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..