జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి:ఏసీపీ మాధవి
హుజురాబాద్, 31 అక్టోబర్ (హి.స.) కుల, మత, వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని హుజూరాబాద్ ఏసిపి మాధవి పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పోల
ఏసీపీ మాధవి


హుజురాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

కుల, మత, వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని హుజూరాబాద్ ఏసిపి మాధవి పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఘనంగా 'జాతీయ సమైక్యత దినోత్సవం' (రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీని ఏసిపి మాధవి,ఆర్డీవో రమేష్ లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏసిపి మాధవి మాట్లాడుతూ.. భారతదేశాన్ని 564 సంస్థానాలుగా విడిపోయి ఉన్న దేశాన్ని ఒక్కటిగా చేసి ఏకతాటిపై నడిపించిన మహనీయుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande