
జయశంకర్ భూపాలపల్లి, 31 అక్టోబర్ (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం వారు కాటారం మండలంలోని ధన్వాడ, శంకరపల్లి, రేగుల గూడెం గ్రామాలను సందర్శించి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు