
తెలంగాణ, ఖమ్మం. 31 అక్టోబర్ (హి.స.)
సీపీఎం నాయకుడు పాతర్ల పాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు (75) హత్య విషయం తెలుసుకున్న చింతకాని పోలీసులు వెంటనే రంగంలోకి దిగి హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ పరిశీలించారు. రామారావు హత్య జరిగిన తీరును పరిశీలించి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. హత్య వార్త తెలుసుకున్న సీపీఎం నాయకులు పాతర్లపాడు గ్రామానికి చేరుకున్నారు.
ఖమ్మం జిల్లా సి పి సునీల్ దత్ మాట్లాడుతూ.. సామినేని రామారావు హత్య పై విచారణ చేస్తున్నాం. ఫోరెన్సిక్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి సమాచారం లేకుండా అసత్య ప్రచారం చేయకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి అని సామినేని రామారావు కుటుంబానికి న్యాయం జరిగేలా విచారణ చేస్తున్నాం అని తెలిపారు. సీపీ సునీల్ దత్ వెంట వైరా ఏసీపీ మరియు సబ్ డివిజన్ లో ఉన్న సీఐ లు ఎస్ ఐ లు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు