నిజామాబాద్ జిల్లాలో నీటిపాలైన ధాన్యం కుప్పలు..
నిజామాబాద్, 30 అక్టోబర్ (హి.స.) బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన వర్షం అన్నదాతలను ఆగం చేసింది. తుఫాను ప్రభావంతో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వ్యాప్తంగా జోరు వాన బీభత్సం సృష్టించింది. ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోగా, క
నిజామాబాద్ జిల్లా


నిజామాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన వర్షం అన్నదాతలను ఆగం చేసింది. తుఫాను ప్రభావంతో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వ్యాప్తంగా జోరు వాన బీభత్సం సృష్టించింది. ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోగా, కోతకొచ్చిన పంట నేలరాలి నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర చెందుతున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande