
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)
పర్చూరు: తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ( అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆయన పర్యటించారు. అన్నంబొట్లవారిపాలెం, పర్చూరు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులను పరిశీలించారు. పర్చూరులో ఇళ్లలో నిల్వ ఉంచిన పొగాకు మండెలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగుల ఉద్ధృతితో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని.. 24 గంటల్లోనే పునరుద్ధరణ పనులు చేసినట్లు చెప్పారు. నేటి సాయంత్రంలోగా వ్యవసాయ కనెక్షన్లు కూడా పునరుద్ధరిస్తామన్నారు.
P
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ