మొంథా. తుఫాను ప్రభావం తో కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి వరద
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.) : మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద వరద నీటిని ద
మొంథా. తుఫాను ప్రభావం తో కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి వరద


అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)

: మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్‌ ఫ్లో 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశముందని.. ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశముందని చెప్పారు. లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దని ప్రఖర్‌జైన్‌ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande