హరీష్ రావును పరామర్శించిన జాగృతి కవిత..
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు వయోభారంతో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు, పార్టీల ముఖ్య నేతలు, అభిమానులు హరీశ్రావు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున
జాగృతి కవిత


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు వయోభారంతో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు, పార్టీల ముఖ్య నేతలు, అభిమానులు హరీశ్రావు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆయన తండ్రి మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోకాపేట్ లోని హరీశ్రావు నివాసానికి భర్త అనిల్తో కలిసి వెళ్లారు. ముందుగా సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్రావుతో మాట్లాడి, ఆయన కుటుంబ సభ్యులు, మేనత్త లక్ష్మిని ఓదార్చారు. అనంతరం ఆమె నేరుగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్లిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande