
ఆదిలాబాద్, 30 అక్టోబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కోటా (కే) గ్రామంలో
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సందర్భంగా లబ్ధిదారుడి పై దాష్టీకం చేసిన గుత్తేదారు విషయంలో కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. ఈ ఘటన పై బోధ్ పోలీసు స్టేషన్లో FIR నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గుత్తేదారు ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి, అతన్ని ఇందిరమ్మ హౌసింగ్ పనుల నుండి తొలగించి బ్లాక్స్ట్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సదరు గుత్తేదారు చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసి, లబ్ధిదారుల ఇళ్లు ఇతర మేస్త్రీల ద్వారా పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
గుత్తేదారులు, మేస్త్రీలు ఎవరైనా లబ్ధిదారుల పై దాష్టీకం లేదా దుర్వినియోగం చేస్తే, భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..