
గుంటూరు, 30 అక్టోబర్ (హి.స.)
: మొంథా తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని నల్లమడ వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. కాకుమాను మండలం కొండపాటూరు సమీపంలో నల్లమడ వాగు కట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లి సమీప పొలాల్లోకి చేరుతోంది. వరద మరింత పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాగు ఉద్ధృతి మరో మూడు అడుగులు పెరిగితే కాకుమాను మండలం గార్లపాడు వద్ద ప్రమాదం పొంచి ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ