
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)
రాంబిల్లి: వరద కారణంగా ఓ కుటుంబం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వీరిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోటు సహాయంతో బయటికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఒడ్డున పామాయిల్ తోటలో దంపతులిద్దరు, పిల్లలు చిక్కుకుపోయారు. తోటను వరద నీరు చుట్టుముట్టడంతో ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. విశాఖ నుంచి బోటును రప్పించి బాధితులను బయటికి తీసుకొచ్చారు. అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. (Andhra Pradesh
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ