
కాజీపేట, 30 అక్టోబర్ (హి.స.)
భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధ, గురువారాల్లో రద్దు, కుదింపు చేసి నడుపుతున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్(12714/12713), గుంటూరు-సికింద్రా బాద్ల మధ్య నడిచే ఇంటర్ సిటీ(12705/12706), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెప్రెస్ (17233/17234), కాజీపేట- డోర్నకల్ మధ్య నడిచే పుష్పల్ రైలును రద్దు చేశారు.
వీటితో పాటుగా గోల్కొండ, సింగరేణి రైళ్లను కుదించి నడుపుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా విజయ వాడ సెక్షన్లో నడిచే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా దారి మళ్లించి నడిపారు. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలును పగిడపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు