
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు SDRF, PR_ 27 నిధులు వాడుకొని, తదుపరి 30 రోజుల్లో RATIFY చేసుకోవాలని, నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తుపాను నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ 48 గంటలు ముందుగా అందరినీ అలర్ట్ చేయడం, ప్రభుత్వ యంత్రాంగం అందుకు అనుగుణంగా స్పందించడంతో ప్రాణ నష్టాన్ని, భారీ ఆస్తి నష్టం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. అలాగే రాబోయే 24 గంటలు కలెక్టర్లు ఇతర అధికారులు సైక్లోన్, మాన్యువల్ దగ్గర పెట్టుకొని సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..